మరణించిన భార్యపై మమకారం ఇంటినే దేవాలయంగా మార్చి నిత్య పూజలు చేస్తున్న భర్త

మరణించిన భార్యపై మమకారం ఇంటినే దేవాలయంగా మార్చి నిత్య పూజలు చేస్తున్న భర్త

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా సాంప్‌ఖేడా గ్రామంలో ఒక భర్త తన భార్యపై ఉన్న ప్రేమని చాటుకుంటూ ఆమె కోసం ఏకంగా ఒక ఆలయాన్నే నిర్మించారు. 2021లో కరోనా కారణంగా మరణించిన తన భార్య గీతాబాయి జ్ఞాపకార్థం నారాయణ్ సింగ్ రాథోడ్ ఈ ఆలయాన్ని నిర్మించి, అందులో ఆమె మూడు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. రాజస్థాన్ కళాకారులు రూపొందించిన ఈ విగ్రహం తమ మధ్యే ఉందన్న భావనను కలిగిస్తుందని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ ఆలయంలో ప్రతిరోజూ విగ్రహానికి కొత్త చీరలు కట్టి, ఇంట్లో వండిన ఆహారాన్ని ముందుగా ఆమెకే నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆమె ఆశీస్సులు తీసుకోవడం ఈ కుటుంబానికి ఒక ఆచారంగా మారింది. తల్లి మరణం తర్వాత కృంగిపోయిన కుమారులు ఇచ్చిన ఆలోచనతో తండ్రి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ అరుదైన ఆలయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది, ప్రేమకు మరియు మాతృభక్తికి ఇది ఒక అద్భుత నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *