భోజనం మరియు విరామం ఇవ్వలేదని పెళ్లి ఫోటోలన్నీ డిలీట్ చేసిన ఫోటోగ్రాఫర్
December 31, 2025

పెళ్లి వేడుకలో కనీసం భోజనం మరియు కాసేపు విశ్రాంతి ఇచ్చేందుకు నిరాకరించిన వరుడికి ఒక ఫోటోగ్రాఫర్ షాకిచ్చాడు. ఉదయం నుండి నిరంతరాయంగా పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్, ఆకలి వేయడంతో 20 నిమిషాల విరామం కోరాడు. అయితే విరామం తీసుకుంటే డబ్బులు ఇవ్వనని వరుడు బెదిరించడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి వరుడి కళ్లెదుటే పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
కేవలం తన స్నేహితుడి కోరిక మేరకు తక్కువ ధరకే ఫోటోలు తీయడానికి ఒప్పుకున్న అతనికి, అక్కడ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఎండ వేడిమి మరియు ఆకలితో అలిసిపోయిన తన పట్ల వరుడు ప్రవర్తించిన తీరు నచ్చక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.