300 కోట్ల ‘ధురంధర్’ మూవీకి ధ్రువ్ రాఠీ చెక్! ‘ప్రచార చిత్రం’ అంటూ సంచలన సవాల్!
December 21, 2025

ఆదిత్య ధర్ దర్శకత్వంలో 300 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్’ సినిమాపై ప్రముఖ ఇన్ ఫ్లూయెన్సర్ ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదొక ‘ప్రోపగండా’ చిత్రమని మండిపడుతూ, కేవలం తన ఒక్క యూట్యూబ్ వీడియోతో ఈ సినిమా ఇమేజ్ను దెబ్బతీస్తానని ఆయన సవాల్ విసిరారు.
సినిమాలోని హింస యువత మనసులను కలుషితం చేస్తోందని, డబ్బు కోసం నిర్మాతలు ఇలాంటి కంటెంట్ రూపొందిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వీడియో చూశాక ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందని ధ్రువ్ పేర్కొనడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.