యువరాజ్, ఉతప్ప ఆస్తులు జప్తు! ఆన్లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం
December 20, 2025

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 1xBet మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ మరియు రాబిన్ ఉతప్పల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. యువరాజ్ సింగ్కు చెందిన ₹2.5 కోట్లు, ఉతప్పకు చెందిన ₹8.26 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
₹1,000 కోట్ల ఈ భారీ కుంభకోణంలో గతంలో శిఖర్ ధావన్, సురేష్ రైనాల ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. పీఎంఎల్ఏ చట్టం కింద జరుగుతున్న ఈ విచారణలో ఇప్పటివరకు మొత్తం ₹19.07 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయి.