మోదీ సభకు వస్తూ విషాదం: రైలు ఢీకొని ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు!

మోదీ సభకు వస్తూ విషాదం: రైలు ఢీకొని ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు!

నదియా జిల్లా తాహెర్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు రైలు ఢీకొని మరణించారు. శనివారం ఉదయం రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులను ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన రమా ప్రసాద్ ఘోష్, ముక్తిపాద సూత్రధార్ మరియు గోపీనాథ్ దాస్‌గా గుర్తించారు.

ప్రమాద సమయంలో మరొకరు తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కృష్ణానగర్ జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని సభకు ముందే జరిగిన ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *