400 ఏళ్ల తపాలా వ్యవస్థకు స్వస్తి పలుకుతూ డెన్మార్క్ సంచలన నిర్ణయం
January 2, 2026

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెన్మార్క్ తన 400 ఏళ్ల నాటి సుదీర్ఘ తపాలా సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. 1624లో ప్రారంభమైన ఈ చారిత్రక వ్యవస్థకు ముగింపు పలుకుతూ, ప్రభుత్వ సంస్థ ‘పోస్ట్నార్డ్’ డిసెంబర్ 30న చివరి ఉత్తరాన్ని పంపిణీ చేసింది. డిజిటల్ విప్లవం కారణంగా గత 25 ఏళ్లలో ఉత్తరాల సంఖ్య 90 శాతం తగ్గిపోవడంతో, ఈ సాంప్రదాయ సేవలను నిలిపివేయక తప్పలేదని ప్రభుత్వం ప్రకటించింది.
డిజిటల్ మెయిల్ మరియు మొబైల్ యాప్ల వాడకం పెరగడంతో పోస్ట్నార్డ్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో కేవలం ఈ-కామర్స్ పార్శిల్ డెలివరీలపైనే దృష్టి సారించనున్నట్లు సంస్థ సీఈఓ కిమ్ పెడెర్సెన్ తెలిపారు. ప్రభుత్వ పోస్టల్ సేవలు ముగిసినప్పటికీ, ప్రైవేట్ కొరియర్ సంస్థల ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత ఉత్తరాలను పంపుకోవచ్చని రవాణా శాఖ స్పష్టం చేసింది.