ట్యూషన్ టీచర్ బండారం బయటపడింది మైనర్ విద్యార్థినిపై అఘాయిత్యం చేసిన నిందితుడు అరెస్ట్
January 2, 2026

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల ట్యూషన్ టీచర్ రమేష్ చంద్ర నిరంజన్ ఒక మైనర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించి పోలీసులకు చిక్కాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో భయపడి అక్కడి నుండి పరారయ్యాడు.
మరుసటి రోజు నిందితుడు మళ్లీ ట్యూషన్ చెప్పడానికి రాగా, స్థానికులు అతడిని పట్టుకుని నిలదీశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు.