400 ఏళ్ల తపాలా వ్యవస్థకు స్వస్తి పలుకుతూ డెన్మార్క్ సంచలన నిర్ణయం

400 ఏళ్ల తపాలా వ్యవస్థకు స్వస్తి పలుకుతూ డెన్మార్క్ సంచలన నిర్ణయం

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెన్మార్క్ తన 400 ఏళ్ల నాటి సుదీర్ఘ తపాలా సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. 1624లో ప్రారంభమైన ఈ చారిత్రక వ్యవస్థకు ముగింపు పలుకుతూ, ప్రభుత్వ సంస్థ ‘పోస్ట్‌నార్డ్’ డిసెంబర్ 30న చివరి ఉత్తరాన్ని పంపిణీ చేసింది. డిజిటల్ విప్లవం కారణంగా గత 25 ఏళ్లలో ఉత్తరాల సంఖ్య 90 శాతం తగ్గిపోవడంతో, ఈ సాంప్రదాయ సేవలను నిలిపివేయక తప్పలేదని ప్రభుత్వం ప్రకటించింది.

డిజిటల్ మెయిల్ మరియు మొబైల్ యాప్‌ల వాడకం పెరగడంతో పోస్ట్‌నార్డ్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో కేవలం ఈ-కామర్స్ పార్శిల్ డెలివరీలపైనే దృష్టి సారించనున్నట్లు సంస్థ సీఈఓ కిమ్ పెడెర్సెన్ తెలిపారు. ప్రభుత్వ పోస్టల్ సేవలు ముగిసినప్పటికీ, ప్రైవేట్ కొరియర్ సంస్థల ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత ఉత్తరాలను పంపుకోవచ్చని రవాణా శాఖ స్పష్టం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *