‘జ్ఞానేష్ కుమార్ కాదు, నేరుగా బాస్ రాజీనామా డిమాండ్ చేయండి’! కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

‘జ్ఞానేష్ కుమార్ కాదు, నేరుగా బాస్ రాజీనామా డిమాండ్ చేయండి’! కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీజేపీకి ఒక వినూత్న సలహా ఇచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను కోరడానికి బదులుగా, నిరసనకారులు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామాను డిమాండ్ చేయాలని ఆయన అన్నారు. రకరకాల పదవుల్లో ఉన్న వారి రాజీనామాల కోసం పదే పదే జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడంలో ఎలాంటి ఔచిత్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని ఆదేశాల మేరకే పనిచేశారనే ఆరోపణ ఎన్నికల కమిషనర్ ఏం చేసినా అది తన సొంత నిర్ణయం కాదని, తన ‘బాస్’ అయిన ప్రధాని చెప్పడం వల్లే చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాబట్టి ఆందోళనలు నేరుగా బాస్ రాజీనామాపైనే జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, కేంద్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకున్నాయి.

ప్రతినిధి: వర్తమాన్ ఠాకూర్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *