ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అమ్ములపొదిలోకి సరికొత్త కస్టమ్ డిజైన్ బోయింగ్ 737-8 విమానం

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అమ్ములపొదిలోకి సరికొత్త కస్టమ్ డిజైన్ బోయింగ్ 737-8 విమానం

టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన విస్తరణ వ్యూహంలో భాగంగా తొలి కస్టమ్-డిజైన్ బోయింగ్ 737-8 విమానాన్ని ప్రవేశపెట్టింది. అమెరికాలోని సీటెల్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఈ విమానం జనవరి నుండి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక స్కై ఇంటీరియర్, ఎర్గోనామిక్ సీట్లు, ఎక్కువ లెగ్ రూమ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలతో ఈ విమానాన్ని రూపొందించారు. ప్రయాణికులకు వేడివేడి రుచికరమైన భోజనాన్ని అందించేందుకు ఇందులో ప్రత్యేకంగా ఆన్-బోర్డ్ ఓవెన్ సౌకర్యం కూడా ఉంది.

ప్రస్తుతం 60 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందిస్తున్న ఈ సంస్థ, 2025లో కొత్తగా 12 ప్రాంతాలను చేర్చుకుంది. 100కు పైగా విమానాలతో భారత్‌లో అతిపెద్ద బోయింగ్ ఆపరేటర్‌గా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అవతరించింది. ముఖ్యంగా టైర్-2 మరియు టైర్-3 నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఆధునిక విమానాలు ఇంధన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *