2025లో భారతీయ కుబేరుల సంపదలో పెను మార్పులు అంబానీ అదానీలకు భారీ లాభాలు

2025లో భారతీయ కుబేరుల సంపదలో పెను మార్పులు అంబానీ అదానీలకు భారీ లాభాలు

భారతీయ పారిశ్రామికవేత్తలకు 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ ఏడాది 16.50 బిలియన్ డాలర్ల అదనపు సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. హిండెన్‌బర్గ్ కేసులో సెబీ నుంచి క్లీన్ చిట్ రావడంతో గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్ల సంపదతో బలమైన పునరాగమనం చేశారు. వీరితో పాటు లక్ష్మీ మిట్టల్, సునీల్ మిట్టల్ కూడా భారీ లాభాలను ఆర్జించారు.

అయితే ఐటీ, రియల్ ఎస్టేట్ రంగ దిగ్గజాలకు ఈ ఏడాది కలిసిరాలేదు. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, విప్రో అజీమ్ ప్రేమ్‌జీ సంపద కొన్ని బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయింది. అదేవిధంగా డీఎల్ఎఫ్ కేపీ సింగ్, సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ కూడా షేర్ల పతనం కారణంగా భారీగా నష్టపోయిన వారి జాబితాలో చేరారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *