భార్య కడుపులో ప్రియుడి బిడ్డ నిశ్శబ్దంగా భర్త తీసుకున్న సంచలన నిర్ణయం
December 31, 2025

ఒక వ్యక్తి తన భార్య గర్భవతి అని తెలిసి ఎంతో సంతోషించాడు కానీ ఆ బిడ్డ తనది కాదని తన భార్య ప్రియుడిదని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎదురైన ఈ మోసాన్ని భరించలేకపోయినా అతను ఏమాత్రం తొందరపడకుండా సంయమనం పాటించాడు. బిడ్డ పుట్టే వరకు తొమ్మిది నెలల పాటు భార్యకు అవసరమైన అన్ని సౌకర్యాలను బాధ్యతగా చూసుకుని ఆసుపత్రి ఖర్చులను కూడా భరించాడు.
బిడ్డ పుట్టిన వెంటనే ఆ వ్యక్తి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే విడాకులకు దరఖాస్తు చేసి భార్య ప్రియుడిని పిలిపించి బిడ్డ బాధ్యతను అతనికి అప్పగించాడు. ఎలాంటి ఆస్తి తగాదాలు లేకుండా ఆ బంధం నుండి బయటకు వచ్చేసి ప్రస్తుతం ఐదేళ్ల తర్వాత మరో వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా జీవిస్తున్నాడు. అతని ఈ కథ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.