నెతన్యాహు లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
December 31, 2025

గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో నెతన్యాహు నాయకత్వాన్ని ట్రంప్ కొనియాడారు. ఆయన ఒక అసాధారణ యుద్ధకాల ప్రధాని అని, ఇజ్రాయెల్‌ను అత్యంత ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడేశారని ట్రంప్ ప్రశంసించారు.
నెతన్యాహు స్థానంలో మరొకరు ఉంటే ఇజ్రాయెల్ ఉనికికే ముప్పు వాటిల్లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నెతన్యాహు తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని రక్షించాయని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీ ఇరు దేశాల మధ్య భవిష్యత్ వ్యూహాలకు అత్యంత కీలకంగా మారనుంది.