అమెరికా ఎఫ్ ৩৫ కి దీటుగా జపాన్ కొత్త యుద్ధ విమానం చైనాకు దడ పుట్టిస్తోంది

చైనా సూపర్ పవర్ కావాలనే ఆకాంక్షతో పొరుగు దేశాలకు ముప్పు పెరుగుతున్న తరుణంలో, జపాన్ తన రక్షణ వ్యూహాన్ని మార్చుకుంది. దశాబ్దాలుగా అమెరికా రక్షణపై ఆధారపడిన టోక్యో, మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సొంతంగా సైనిక శక్తిని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బ్రిటన్ మరియు ఇటలీ దేశాలతో కలిసి 2035 నాటికి ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించే ‘గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్’ (GCAP) ను వేగవంతం చేస్తోంది. ఇది అమెరికాకు చెందిన ఎఫ్-35 కంటే అత్యంత శక్తివంతమైనదని నిపుణులు భావిస్తున్నారు.
మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ నేతృత్వంలో తయారవుతున్న ఈ అత్యాధునిక జెట్, అత్యంత వేడిని తట్టుకునే ఇంజన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ల సహాయంతో పనిచేస్తుంది. ఈ యుద్ధ విమానం యుద్ధరంగంలో శత్రువుల సెన్సార్లకు చిక్కకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో అద్భుతాలు సృష్టిస్తుందని జపాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జపాన్ చేపడుతున్న ఈ భారీ రక్షణ ప్రాజెక్టు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.