వేర్వేరు రంగుల కళ్లు ఈ అరుదైన పిల్లి కనిపిస్తే మీరు లక్షాధికారి అవ్వడం ఖాయం

వేర్వేరు రంగుల కళ్లు ఈ అరుదైన పిల్లి కనిపిస్తే మీరు లక్షాధికారి అవ్వడం ఖాయం

మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాకు చెందిన అనుభవ్ సింగ్ కు అడవిలో ఒక అరుదైన ‘ఖావో మనీ’ జాతి పిల్లి లభించింది. ఈ పిల్లి ప్రత్యేకత ఏమిటంటే దీని ఒక కన్ను నీలం రంగులో, మరొకటి పసుపు రంగులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత అరుదైన ఈ జాతి పిల్లి విలువ సుమారు 6 నుండి 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

సాధారణంగా విదేశాల్లో కనిపించే ఈ పిల్లి మన దేశంలో లభించడం చర్చనీయాంశంగా మారింది. పరిశోధకుల ప్రకారం ఈ పిల్లులు చాలా తెలివైనవి మరియు చురుకైనవి. ప్రస్తుతం ‘హేజీ’ అని పేరు పెట్టి అనుభవ్ సింగ్ కుటుంబం దీనిని పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ సంఖ్యలో ఉన్న ఈ అరుదైన పిల్లిని చూడటానికి జనం భారీగా తరలివస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *