దోహాలో అర్జున్ ఇరిగైసి అద్భుత విజయంపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
December 29, 2025

దోహాలో జరిగిన ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం 14 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన అర్జున్, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత 2800 ఫిడే రేటింగ్ పాయింట్లను సాధించిన రెండో భారతీయ క్రీడాకారుడిగా అరుదైన రికార్డు సృష్టించారు.
అర్జున్ సాధించిన ఈ గొప్ప విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అర్జున్ ప్రదర్శన దేశానికే గర్వకారణమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మోదీ ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలను తెలియజేశారు.