ట్రంప్ చేతులు అంత తెల్లగా ఎందుకు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన
December 29, 2025

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో భేటీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ చేతిపై కనిపించిన వింతైన మేకప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ట్రంప్ కుడి చేయి అసాధారణంగా తెల్లగా ఉండటంతో ఆయన ఏదైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 79 ఏళ్ల వయసులో తన అనారోగ్యాన్ని దాచడానికే ట్రంప్ భారీగా మేకప్ వాడుతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇంతకుముందు ట్రంప్ చేతిపై గాయాల గుర్తులు కనిపించినప్పుడు వైట్ హౌస్ వాటిని మందుల దుష్ప్రభావాలుగా కొట్టిపారేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ తాజా ఫొటోలు ఆయన శారీరక దృఢత్వంపై అంతర్జాతీయ స్థాయిలో కొత్త చర్చకు దారితీశాయి.