కోల్‌కతాలో కప్పు టీ ధర వెయ్యి రూపాయలు విస్తుపోతున్న జనం

కోల్‌కతాలో కప్పు టీ ధర వెయ్యి రూపాయలు విస్తుపోతున్న జనం

కోల్‌కతాకు చెందిన పార్థ ప్రతిమ్ గంగూలీ అనే వ్యక్తి ‘నిర్జాష్ టీ స్టాల్’ పేరుతో వినూత్నమైన టీ దుకాణాన్ని నడుపుతున్నారు. 2014లో తన ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రారంభించిన ఈ టీ స్టాల్‌లో ఒక్క కప్పు టీ ధర ఏకంగా 1000 రూపాయలు. ఇంత ధర ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేకమైన టీని రుచి చూడటానికి జనం భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి టీ రుచి ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే అద్భుతంగా ఉంటుందని వినియోగదారులు అంటున్నారు.

ఈ టీ ఇంత ఖరీదైనది కావడానికి కారణం అందులో ఉపయోగించే ‘బో-లే’ (Bo-Lay) రకం టీ ఆకులు. మార్కెట్‌లో ఈ టీ పొడి కేజీ ధర సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అందుకే ఒక కప్పు టీ ధర వెయ్యి రూపాయలుగా ఉంది. అయితే ఈ స్టాల్‌లో కేవలం ఖరీదైన టీ మాత్రమే కాకుండా, సామాన్యుల కోసం 10 రూపాయలకే సాధారణ టీ కూడా లభిస్తుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *