శాంతి నెలకొంటుందా లేక యుద్ధం కొనసాగుతుందా జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

శాంతి నెలకొంటుందా లేక యుద్ధం కొనసాగుతుందా జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, యుద్ధం ముగిసే దశకు చేరుకుందని, అయితే ఇది శాంతితో ముగుస్తుందా లేదా సుదీర్ఘంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాలని అన్నారు. జెలెన్స్కీని కలవడానికి ముందే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సుమారు గంటన్నర పాటు ఫోన్లో సానుకూల చర్చలు జరిపారు.

పుతిన్ మరియు జెలెన్స్కీ ఇద్దరూ ఈ ఘర్షణను ముగించాలని నిజంగా కోరుకుంటున్నారని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ధైర్యాన్ని అభినందించిన ఆయన, శాంతి ఒప్పందానికి సంబంధించి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రాజధానిపై రష్యా దాడులు తీవ్రతరం చేసిన తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం. జెలెన్స్కీతో చర్చల అనంతరం మరోసారి పుతిన్‌తో మాట్లాడతానని చెప్పిన ట్రంప్, ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *