కన్నతల్లిపైనే కన్నేసిన కొడుకు, తట్టుకోలేక కసాయి కొడుకుని హతమార్చిన తల్లి

కన్నతల్లిపైనే కన్నేసిన కొడుకు, తట్టుకోలేక కసాయి కొడుకుని హతమార్చిన తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా శ్యామీవాలా గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో కన్నతల్లిపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 32 ఏళ్ల కొడుకు అశోక్‌ను 56 ఏళ్ల తల్లి కొడవలితో నరికి చంపింది. నిందితుడు అశోక్ గత కొంతకాలంగా తల్లిపై అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని, సంఘటన జరిగిన రాత్రి కూడా మద్యం మత్తులో ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన తల్లి, ఆత్మరక్షణ కోసం కొడవలితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన తర్వాత దొంగలు పడ్డారంటూ గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసిన తల్లి, పోలీసుల విచారణలో అసలు నిజాన్ని ఒప్పుకుంది. పరువు పోతుందనే భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ ఆ రాత్రి తన సహనం నశించిందని ఆమె వాపోయింది. పోలీసులు ఘటనా స్థలం నుండి రక్తంతో తడిసిన బట్టలు మరియు హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలైన తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *