ఆహారం తినేటప్పుడు కన్నీళ్లు కార్చే జంతువు ఏదో తెలుసా మేధావులను సైతం ఆలోచింపజేస్తున్న ప్రశ్న
December 29, 2025

పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కీలక పాత్ర పోషిస్తాయి. తాజాగా ఆహారం తినేటప్పుడు ఎప్పుడూ ఏడ్చే జంతువు ఏది అనే ప్రశ్న నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సరైన సమాధానం మొసలి. మొసలి కన్నీళ్లు అనే సామెత మనకు తెలిసినదే అయినప్పటికీ, ఆహారం తినేటప్పుడు అవి కన్నీళ్లు కార్చడం వెనుక ఒక శాస్త్రీయ కారణం దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
మొసళ్లు ఆహారాన్ని నమిలేటప్పుడు వాటి దవడల కదలికల వల్ల సైనస్‌లోకి గాలి చేరుతుంది. దీనివల్ల వాటి కన్నీటి గ్రంథులు ఉత్తేజితమై కళ్ల నుంచి నీరు వస్తుంది. దీనిని శాస్త్రీయంగా ‘క్రొకోడైల్ టియర్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. శాస్త్రవేత్తలు అమెరికన్ అలిగేటర్లపై జరిపిన పరిశోధనలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది.