విడాకులు తీసుకున్న వారితో ప్రేమలో ఉన్నారా సుఖీభవనం కోసం ఈ చిట్కాలు పాటించండి

విడాకులు తీసుకున్న వారితో ప్రేమలో ఉన్నారా సుఖీభవనం కోసం ఈ చిట్కాలు పాటించండి

విడాకులు తీసుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి పిల్లలు ఉంటే, వారిని కూడా మీ సొంత బిడ్డల్లా ప్రేమించడం నేర్చుకోవాలి. పిల్లల అవసరాల కోసం మీ భాగస్వామి తన మాజీ జీవిత భాగస్వామితో మాట్లాడాల్సి రావచ్చు; అటువంటప్పుడు అనవసరమైన అనుమానాలకు తావు ఇవ్వకుండా పరస్పర అవగాహనతో మెలగడం ఉత్తమం. ఇది మీ బంధాన్ని మరింత కాలం నిలబెడుతుంది.

గొడవలు జరిగినప్పుడు ఎప్పుడూ భాగస్వామి గత జీవితాన్ని లేదా వారి మాజీ భాగస్వామిని విమర్శించకండి. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుండి మీ భాగస్వామికి ఎటువంటి అవమానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. భవిష్యత్తులో పిల్లల గురించి తీసుకునే నిర్ణయాల్లో ఇద్దరి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. గతాన్ని తవ్వుకోకుండా, ప్రస్తుత జీవితంలో ఒకరిపై ఒకరు నమ్మకం మరియు గౌరవంతో ముందుకు సాగడమే ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *