గ్రేటర్ నోయిడాలో దారుణం గృహ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య
December 31, 2025

ఢిల్లీ సరిహద్దులోని గ్రేటర్ నోయిడాలో ఒక దంపతుల మరణం స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లోని ఎటాకు చెందిన అనిల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, అతని భార్య అనిత గృహిణిగా ఉండేది. డిసెంబర్ 28 రాత్రి వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన అనిల్ కూరగాయలు కోసే కత్తితో అనితపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
భార్య మరణంతో భయాందోళనకు గురైన అనిల్, అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గది తలుపులు ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ గొడవలే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.