రైలు ప్రయాణికులకు షాక్ విమానం తరహాలో ఇకపై లగేజీకి అదనపు ఛార్జీలు తప్పవు

రైలు ప్రయాణికులకు షాక్ విమానం తరహాలో ఇకపై లగేజీకి అదనపు ఛార్జీలు తప్పవు

రైలు ప్రయాణికులు నిర్ణీత పరిమితికి మించి లగేజీని తీసుకెళ్తే ఇకపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. విమాన ప్రయాణ నిబంధనల తరహాలోనే ప్రతి తరగతికి వేర్వేరు బరువు పరిమితులను రైల్వే శాఖ ఖరారు చేసింది.

జనరల్ క్లాస్‌లో 35 కేజీలు మరియు స్లీపర్‌లో 40 కేజీల వరకు ఉచితంగా అనుమతిస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో గరిష్టంగా 150 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. నిర్ణీత పరిమాణం కంటే పెద్దగా ఉన్న సూట్‌కేసులను ఇకపై ప్యాసింజర్ కోచ్‌లలో కాకుండా బ్రేక్ వ్యాన్‌లలో బుక్ చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *