2025లో యూట్యూబ్ లో భారతీయులు ఎక్కువగా వీక్షించిన టాప్ కంటెంట్ ఇదే
December 18, 2025

భారతీయ యూట్యూబ్ వీక్షకులు 2025లో వినోదం మరియు క్రీడలపై అత్యంత ఆసక్తి చూపినట్లు యూట్యూబ్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ట్రెండింగ్ జాబితాలో ‘స్క్విడ్ గేమ్’ అగ్రస్థానంలో నిలవగా, బాలీవుడ్ సాంగ్ ‘సైయారా’ మరియు రజనీకాంత్ సినిమా ‘కూలీ’ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు కుంభమేళా మరియు ఐపీఎల్ 2025 అంశాలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టాప్ క్రియేటర్స్ జాబితాలో మిస్టర్ బీస్ట్ మొదటి స్థానంలో నిలవగా, సెజల్ గబా మరియు కిమ్ ప్రో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సంగీత విభాగంలో ‘సైయారా’ మరియు ‘రాను బొంబాయికి రాను’ పాటలు హల్ చల్ చేశాయి. భారతీయ ప్రేక్షకులు కేవలం సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా విజ్ఞానదాయకమైన మరియు సామాజిక అంశాల పట్ల కూడా మక్కువ చూపుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.