ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి కాంగ్రెస్‌పై నిషికాంత్ దూబే ఫైర్

ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి కాంగ్రెస్‌పై నిషికాంత్ దూబే ఫైర్

పార్లమెంటులో విబి-జి రామ్ జి బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకం అవినీతికి నిలయంగా మారిందని, గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతోందని ఆరోపించారు. ఈ పథకంలో ఏకంగా యాభై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి లేదా జాతిపిత పేరుతో ఎటువంటి పథకాలు ఉండకూడదని దూబే పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ బిల్లు పట్ల అత్యంత పారదర్శకతతో ఉందని, ప్రతి జిల్లాలో లోక్‌పాల్‌లను నియమించడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. పని కొలతల్లో కచ్చితత్వం పాటించడం ద్వారా నిధుల దుర్వినియోగాన్ని అరికడతామని స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *