అణు రంగంలో ప్రైవేటీకరణ ముప్పు శాంతి బిల్లుపై శశి థరూర్ తీవ్ర ధ్వజమెత్తు

అణు రంగంలో ప్రైవేటీకరణ ముప్పు శాంతి బిల్లుపై శశి థరూర్ తీవ్ర ధ్వజమెత్తు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘శాంతి’ (SHANTI) బిల్లును కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ లోక్‌సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. అణు ఇంధన రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజల భద్రతకు గొడ్డలిపెట్టు అని ఆయన హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే పరిహారం చెల్లింపు పరిమితి చాలా తక్కువగా ఉందని, విదేశీ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈ నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.

రేడియేషన్ ప్రభావం దశాబ్దాల తరబడి ఉంటుందని, కానీ క్లెయిమ్ చేసుకునే సమయం చాలా తక్కువగా ఉందని థరూర్ పేర్కొన్నారు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోవడం అన్యాయమని, ఈ బిల్లు వల్ల పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లోపభూయిష్టంగా ఉన్న ఈ బిల్లును వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *