హిమాలయాల్లో పోయిన అణు పరికరం గంగా నదికి ముప్పుగా మారిందా
December 17, 2025

1965లో చైనాపై నిఘా ఉంచేందుకు సిఐఏ మరియు ఐబి కలిసి నందాదేవి శిఖరంపై ప్లూటోనియం ఆధారిత అణు పరికరాన్ని అమర్చాలని ప్రయత్నించాయి. అయితే భారీ మంచు తుఫాను కారణంగా పర్వతారోహకులు ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారు. మరుసటి ఏడాది వెతికినా ఆ పరికరం జాడ దొరకలేదు, అది మంచు కింద పూడిపోయిందని భావిస్తున్నారు.
ఈ పరికరం నుండి రేడియోధార్మికత వెలువడితే గంగానది నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నందాదేవి హిమానీనదాలు గంగకు ప్రధాన వనరు కావడంతో, ఈ అణు ఇంధనం కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది.