హెడ్‌ఫోన్‌లతో నిద్రపోతున్నారా? తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది!
December 29, 2025

నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రించేటప్పుడు చెవులకు హెడ్‌ఫోన్‌లు పెట్టుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ సౌండ్‌లో ఎక్కువసేపు పాటలు వినడం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గి, శాశ్వత చెవుడుకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఎక్కువసేపు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం వలన చెవి లోపల సహజమైన తేమ దెబ్బతింటుంది.
హెడ్‌ఫోన్‌ల ఇయర్ బడ్స్‌లో బ్యాక్టీరియా పెరిగి, అవి చెవి లోపలికి వ్యాపించి ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. ఎక్కువసేపు హెడ్‌ఫోన్‌లు ధరించడం వలన చెవి గులిబి (Ear Wax) సులభంగా బయటకు రాకుండా, మరింత లోపలికి నెట్టబడుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ లేదా వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, ఈ ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి, హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని నిద్రపోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.