35 ఏళ్లుగా కడుపులోనే శిశువు బయటపడిన విస్తుపోయే నిజం
December 30, 2025

అల్జీరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఆమె గర్భంలో దాదాపు 35 ఏళ్ల నుంచి చనిపోయిన ఏడు నెలల పిండం ఉందని పరీక్షల్లో తేలింది. వైద్య భాషలో దీనిని ‘లిథోపెడియన్’ లేదా ‘బేబీ స్టోన్’ అని పిలుస్తారు. సుమారు 2 కిలోల బరువున్న ఈ శిశువు కాలక్రమేణా గర్భంలోనే రాయిలా మారిపోయింది.
గర్భాశయంలో కాకుండా పొత్తికడుపులో గర్భం దాల్చినప్పుడు రక్తప్రసరణ అందక శిశువు అక్కడే మరణిస్తుంది. ఆ పిండం బయటకు వచ్చే మార్గం లేకపోవడంతో అది శరీరంలోనే ఉండిపోయి రాయిలా తయారవుతుందని వైద్యులు తెలిపారు. మూడున్నర దశాబ్దాలుగా తన కడుపులో శిశువు రాయిలా మారి ఉందన్న విషయం ఆ వృద్ధురాలికి కూడా తెలియకపోవడం గమనార్హం.