26 రకాల పాము విషానికి ఈ జంతువు కన్నీరే విరుగుడు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చుక్కలు ఇవే
December 31, 2025

ఎడారి ఓడగా పిలవబడే ఒంటె కన్నీళ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కామెల్ (NRCC) మరియు లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రకారం, ఒంటె కన్నీళ్లలోని యాంటీబాడీలు 26 రకాల విషపూరిత పాముల విషాన్ని నిర్వీర్యం చేయగలవు. అందుకే ఈ కన్నీళ్లకు ప్రపంచ మార్కెట్లో అత్యంత భారీ ధర పలుకుతోంది.
ముఖ్యంగా ప్రమాదకరమైన సా-స్కేల్డ్ వైపర్ వంటి పాముల కాటుకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని పరిశోధకులు నిరూపించారు. మన దేశంలో ప్రతి ఏటా పాముకాటు వల్ల సంభవిస్తున్న మరణాలను అరికట్టడంలో ఈ పరిశోధన ఒక విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. ఈ విశిష్ట యాంటీబాడీల వల్ల భవిష్యత్తులో ఒంటె కన్నీళ్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.