16 ఏళ్ల లోపు వారికి ఇంటర్నెట్ నిషేధం? మద్రాస్ హైకోర్టు సంచలన ప్రతిపాదన

16 ఏళ్ల లోపు వారికి ఇంటర్నెట్ నిషేధం? మద్రాస్ హైకోర్టు సంచలన ప్రతిపాదన

భారతదేశంలో 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఇంటర్నెట్ వాడకంపై చట్టపరమైన నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఆస్ట్రేలియా తరహాలోనే భారత్‌లో కూడా ఇటువంటి కఠిన నిబంధనలు తీసుకురావాలని జస్టిస్ జి. జయచంద్రన్ మరియు జస్టిస్ కె.కె. రామకృష్ణన్‌లతో కూడిన మధురై బెంచ్ అభిప్రాయపడింది. పిల్లల మానసిక ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా ఈ చర్య అవసరమని ధర్మాసనం పేర్కొంది.

ఇంటర్నెట్ వినియోగంలో పిల్లలకు రక్షణ కల్పించడానికి ‘పేరెంటల్ విండో’ వంటి నియంత్రణలను అమలు చేయాలని మరియు సురక్షితమైన ఇంటర్నెట్ వాడకంపై అవగాహన పెంచాలని కోర్టు సూచించింది. మైనర్లను ఆన్‌లైన్ ప్రమాదాల నుండి కాపాడేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *