సహారన్‌పూర్ దారుణం ప్రియురాలి తల నరికి హత్య చేసిన ప్రియుడు బిలాల్ అరెస్ట్
December 18, 2025

యూపీలోని సహారన్‌పూర్‌లో దారుణం వెలుగుచూసింది. తన నికాకు అడ్డుగా ఉందని లివ్-ఇన్ పార్టనర్ ఉమాను ప్రియుడు బిలాల్ అతికిరాతకంగా హత్య చేసి, తల నరికి అడవిలో పడేశాడు. హిమాచల్ తీసుకెళ్లి కారు సీటు బెల్టుతో గొంతు నులిమి చంపిన తర్వాత, మాంసం కోసే కత్తితో తల వేరు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
15 ఏళ్ల క్రితమే ఉమాతో సంబంధాలు తెంచుకున్న కుటుంబ సభ్యులు, మానవత్వంతో సోమవారం ఆమె తలకు అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుడు బిలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, తన పెళ్లికి ముందు సాక్ష్యాలను చెరిపేసేందుకు మొబైల్ డేటాను కూడా డిలీట్ చేసినట్లు విచారణలో తేలింది.