బెంగాల్ ఓటర్ల జాబితాలో ప్రకంపనలు: 1.90 కోట్ల మంది సందేహాస్పద ఓటర్లపై రచ్చ
December 18, 2025

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. సుమారు 1.90 కోట్ల మంది ఓటర్లను ‘సందేహాస్పద’ కేటగిరీలో చేర్చగా, 58 లక్షల పేర్లను తొలగించారు. తండ్రి, కొడుకుల వయసు మధ్య వ్యత్యాసం 15 ఏళ్ల కంటే తక్కువ ఉండటం వంటి అనేక అక్రమాలను ఎన్నికల సంఘం డేటా అనాలిసిస్‌లో గుర్తించింది.
వీరిలో అత్యధికులు బంగ్లాదేశీ చొరబాటుదారులని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నకిలీ ఓటర్ల ద్వారానే మమతా బెనర్జీ గెలుస్తున్నారని బీజేపీ విమర్శించగా, ఈ ప్రక్రియను టీఎంసీ తప్పుబడుతోంది. ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఈ తప్పులను సరిదిద్దే పనిలో ఉన్నారు.