వంట నూనెలో ప్రాణాంతక విషం! ఏటా లక్షల మంది మరణానికి కారణమవుతున్న రిఫైన్డ్ ఆయిల్

వంట నూనెలో ప్రాణాంతక విషం! ఏటా లక్షల మంది మరణానికి కారణమవుతున్న రిఫైన్డ్ ఆయిల్

మనం నిత్యం వాడే రిఫైన్డ్ ఆయిల్ మనిషి పాలిట శాపంగా మారుతోంది. కేరళ ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, ఈ నూనె వాడకం వల్ల ఏటా సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం గుండె జబ్బులే కాకుండా క్యాన్సర్, డయాబెటిస్, పక్షవాతం మరియు సంతానలేమి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. శరీరంలోని డీఎన్ఏను దెబ్బతీస్తూ, కిడ్నీ మరియు లివర్ పనితీరును మందగించేలా చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నూనెను శుద్ధి చేసే క్రమంలో వాడే ప్రమాదకర రసాయనాలే ఈ పరిస్థితికి కారణం. నూనె రంగు, వాసన పోగొట్టడానికి కాస్టిక్ సోడా, సల్ఫర్ మరియు వివిధ రకాల యాసిడ్లను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో వెలువడే వ్యర్థాలను టైర్ల తయారీలో వాడతారంటే ఇది ఎంత విషపూరితమో అర్థం చేసుకోవచ్చు. ఎముకల బలహీనత, కంటి చూపు తగ్గడం వంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే వంట నూనె విషయంలో జాగ్రత్త వహించడం తప్పనిసరి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *