రైతుభరోసాపై సర్కార్ లీకులు రైతుల పాలిట శాపంగా మారాయా

హైదరాబాద్: తెలంగాణలో రైతుభరోసా పథకం అమలు తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి వస్తున్న వరుస లీకులు క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం పైసా కూడా అందించడం లేదు. మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు సర్కార్ ఈ ‘లీకుల అస్త్రాన్ని’ ప్రయోగించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ అనుకూల పత్రికలు, సోషల్ మీడియా వేదికగా ఫిబ్రవరి 17 నుంచే నిధులు జమ అవుతాయని ప్రచారం జరిగినప్పటికీ, ఆ గడువు ముగిసినా రైతుల ఖాతాల్లో నగదు చేరలేదు. ఆర్బీఐ నుంచి రూ. 9 వేల కోట్ల రుణం తీసుకున్నట్లు వార్తలు వచ్చినా, సాగు సీజన్ ముగింపు దశకు చేరుకున్నా పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
రాబోయే పరిషత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు లేకపోతే ఈ సీజన్ రైతుభరోసా నిలిచిపోతుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.