కేసీఆర్ పుట్టినరోజు వేళ రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు ఆసక్తికర పోస్టులు

కేసీఆర్ పుట్టినరోజు వేళ రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు ఆసక్తికర పోస్టులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇద్దరు ముఖ్యమంత్రులు విష్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *