తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి కోమటిరెడ్డి యాక్షన్.. నల్గొండ ప్రకాశం బజార్‌లో ఏం జరిగిందంటే

తెల్లవారుజామున 4 గంటలకే మంత్రి కోమటిరెడ్డి యాక్షన్.. నల్గొండ ప్రకాశం బజార్‌లో ఏం జరిగిందంటే

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకే మున్సిపల్, పోలీస్ బలగాలతో కలిసి ఆక్రమణల తొలగింపును పర్యవేక్షించారు.

సుమారు మూడు గంటల పాటు అక్కడే ఉండి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌తో పాటు అర కిలోమీటరు మేర ఉన్న అక్రమ షెడ్లను ఎక్స్‌కవేటర్లతో తొలగింపజేశారు. ఈ క్రమంలో ఆందోళన చెందిన చిరు వ్యాపారులను మంత్రి స్వయంగా సముదాయించారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక్కొక్కరికి 100 గజాల స్థలం కేటాయించి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిత్యం ట్రాఫిక్ నరకంతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *