యూఏఈ జైలులో మాజీ సైనికుడు.. సోదరుడి ప్రాణాల కోసం ప్రధాని మోదీని వేడుకున్న నటి సెలినా జైట్లీ!

యూఏఈ జైలులో మాజీ సైనికుడు.. సోదరుడి ప్రాణాల కోసం ప్రధాని మోదీని వేడుకున్న నటి సెలినా జైట్లీ!

యూఏఈలో గత 18 నెలలుగా బందీగా ఉన్న తన సోదరుడు మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ జైట్లీని రక్షించాలని బాలీవుడ్ నటి సెలినా జైట్లీ ప్రధాని మోదీని కోరారు. 2024 సెప్టెంబర్‌లో మాల్ పార్కింగ్‌లో అపహరణకు గురైన విక్రాంత్, అబుదాబిలోని అల్-వత్బా డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పనిచేసిన సైనికుడిపై ఎలాంటి కేసులు లేకుండా జైల్లో ఉంచడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తాజాగా యూఏఈకి చెందిన న్యాయ సంస్థను నియమించేందుకు అనుమతించింది. ఫిబ్రవరి 10న తదుపరి విచారణ జరగనుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన సోదరుడిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని సెలినా విజ్ఞప్తి చేశారు. సైనికుల వెనుక దేశం అండగా ఉండాలని, తన సోదరుడిని తిరిగి తెచ్చే వరకు పోరాడతానని ఆమె పేర్కొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *