యుద్ధానికి ముగింపు పడనుందా ట్రంప్‌తో జెలెన్స్కీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

రష్యా ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. డిసెంబర్ 28న అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జరపనున్న భేటీపై ప్రపంచం ఆశలు పెట్టుకుంది. పుతిన్ పెట్టిన కఠిన నిబంధనల వల్ల శాంతి చర్చలు ఆగిపోయినప్పటికీ, ఈ భేటీ ద్వారా ఏదో ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా అంధకారంలో ఉన్న ఉక్రెయిన్ ప్రజల కోసం జెలెన్స్కీ ఈ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు.
శాంతి ఒప్పందంలో 90 శాతం అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, మిగిలిన 10 శాతంపైనే సందిగ్ధత కొనసాగుతోందని జెలెన్స్కీ తెలిపారు. కొత్త ఏడాదికి ముందే యుద్ధం ముగిసి శాంతి నెలకొంటుందా లేక పోరాటం మరింత తీవ్రమవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌తో జరిగే ఈ చర్చల తర్వాత ఉక్రెయిన్ భవిష్యత్తు మరియు రష్యాతో సంబంధాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.