మైదానంలో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా

మైదానంలో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఇషాన్ కిషన్, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు సాధించి సంచలనం సృష్టించారు. అయితే బీసీసీఐ సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, ప్రస్తుతం తన స్వస్థలం పాట్నాలో గడుపుతున్నారు. క్రికెట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ, అక్కడ తన క్రికెట్ అకాడమీలో చిన్నారులకు శిక్షణ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఇషాన్ కిషన్ చిన్న పిల్లలకు క్రికెట్ మెళకువలు నేర్పిస్తూ కనిపిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఈ స్టార్ ప్లేయర్, తన అద్భుతమైన ఫామ్ కారణంగా త్వరలోనే వన్డే జట్టులోకి కూడా పునరాగమనం చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *