మీకు తల వెనుక భాగంలో తరచూ నొప్పి వస్తుందా ఇది తీవ్రమైన హై బీపీకి సంకేతం కావచ్చు జాగ్రత్త
February 13, 2026

సాధారణంగా వచ్చే తలనొప్పులను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం ముఖ్యంగా తల వెనుక భాగంలో తరచూ నొప్పి వస్తుంటే అది రక్తపోటు పెరగడానికి సంకేతం కావచ్చు. రక్తపోటు 180/120 mmHg కంటే ఎక్కువగా నమోదైనప్పుడు మెదడులోని రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి ఈ నొప్పి వస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవసరం.
అధిక రక్తపోటు వల్ల తల వెనుక భాగం భారంగా ఉండటంతో పాటు చూపు మసకబారడం, తలతిరగడం మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వీటిని సాధారణ సమస్యగా భావిస్తారు కానీ ఇది మెడికల్ ఎమర్జెన్సీకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి తల వెనుక భాగంలో నొప్పిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపోటును తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.