మరణ సమయంలో మనిషి మాట ఎందుకు పడిపోతుంది గరుడ పురాణంలో దాగి ఉన్న నగ్న సత్యం

మరణ సమయంలో మనిషి మాట ఎందుకు పడిపోతుంది గరుడ పురాణంలో దాగి ఉన్న నగ్న సత్యం

గరుడ పురాణం ప్రకారం మరణం సంభవించే ముందు మనిషి ఇంద్రియాలు మొద్దుబారిపోతాయి. ఈ క్రమంలోనే అందరికంటే ముందుగా మాట్లాడే శక్తి కోల్పోతాడు కాబట్టి తన చివరి కోరికలను ఎవరికీ చెప్పలేకపోతాడు. మరణం చేరువైనప్పుడు లభించే దివ్యదృష్టి ద్వారా వ్యక్తి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను స్పష్టంగా చూడగలుగుతాడు. ఈ మార్పు సహజమైనప్పటికీ ప్రాపంచిక బంధాల వల్ల అది ఎంతో బాధాకరంగా మారుతుంది.

చివరి క్షణాల్లో యమదూతల భయంకర రూపాన్ని చూసి మనిషి తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతాడు. ప్రాణాలు శరీరాన్ని విడిచే సమయంలో ఒకేసారి వంద తేళ్లు కుట్టినంత వేదన కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. గొంతు ఎండిపోయి ఎంత విలవిలలాడినా మరియు తీవ్రమైన నొప్పిని అనుభవించినా మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతో ఆ వ్యక్తి కనీసం అరవలేక నిశ్శబ్దంగా ఉండిపోతాడు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *