భోపాల్‌లో ఘోరం ఒకే రాత్రి నాలుగు కార్లలో మార్చి మార్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

భోపాల్‌లో ఘోరం ఒకే రాత్రి నాలుగు కార్లలో మార్చి మార్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

భోపాల్‌లో ట్యూషన్ నుండి ఇంటికి వెళ్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి నాలుగు వేర్వేరు కార్లలో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిందితులు ఆసిఫ్ ఖాన్ మరియు మాజ్ ఖాన్ బాలికను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఈ దారుణానికి ఒడిగట్టడమే కాకుండా, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురిచేశారు.

బాధిత బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు వినియోగించిన నాలుగు కార్లను సీజ్ చేసిన పోలీసులు, వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *