జ్యోతిష్యుడి మాటలు నమ్మి నిద్రిస్తున్న తల్లిని దిండుతో అదిమి చంపిన కూతురు
February 13, 2026

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జ్యోతిష్యుడి మూఢనమ్మకాలకు బలై కన్నతల్లిని కూతురు హత్య చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది. తన తండ్రి మరణానికి తల్లి చేసిన ‘చేతబడి’ కారణమని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి, సుచిత్ర అనే మహిళ నిద్రిస్తున్న పుష్పవతిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది.
ఈ మరణాన్ని సహజమరణంగా చిత్రీకరించి అంత్యక్రియలు నిర్వహించే ప్రయత్నం చేయగా, స్థానికుల అనుమానంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితురాలు తన నేరాన్ని అంగీకరించగా, క్యాత్సంద్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య పథకంలో ఆమె భర్త ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.