విజయ్ సేలం బహిరంగ సభలో విషాదం ఎండదెబ్బతో అభిమాని మృతి

విజయ్ సేలం బహిరంగ సభలో విషాదం ఎండదెబ్బతో అభిమాని మృతి

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ సేలంలో నిర్వహించిన బహిరంగ సభలో తీవ్ర విషాదం నెలకొంది. సభ జరుగుతుండగా సూరజ్ అనే 37 ఏళ్ల అభిమాని ఎండదెబ్బ మరియు డీహైడ్రేషన్‌తో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

గతంలో కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట తర్వాత ఈ ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నిర్ణీత పరిమితికి మించి సుమారు 7 వేల మంది తరలిరావడంతో నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *