బలూచిస్తాన్‌లో మారణహోమం: పాకిస్తాన్‌కు మద్దతుగా ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన!

బలూచిస్తాన్‌లో మారణహోమం: పాకిస్తాన్‌కు మద్దతుగా ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన!

బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన వరుస ఆత్మాహుతి దాడులను అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ, ఈ దాడులకు బాధ్యులైన వారిని శిక్షించే విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఈ దాడుల వెనుక భారత హస్తం ఉందన్న పాక్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. మరోవైపు, తిరుగుబాటుదారులపై పాక్ సైన్యం జరిపిన ఆపరేషన్‌లో 216 మంది మరణించినట్లు సమాచారం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తాము పాకిస్తాన్‌ వెంటే ఉంటామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి కూడా ఖండించడం గమనార్హం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *