తగ్గని EMI భారం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్! బ్యాంక్ కస్టమర్ల కోసం RBI కీలక నిర్ణయం?

తగ్గని EMI భారం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్! బ్యాంక్ కస్టమర్ల కోసం RBI కీలక నిర్ణయం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో లోన్ ఈఎంఐలు తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు నిరాశే ఎదురైంది. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమై, సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయింది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.

కాగా, బ్యాంకింగ్ మోసాల బారిన పడే కస్టమర్లకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఆన్‌లైన్ మోసాల వల్ల నష్టపోయిన వారికి త్వరితగతిన పరిహారం అందించేలా పాత చట్టాలను సవరించనుంది. అలాగే బ్యాంకులు కస్టమర్లను తప్పుదోవ పట్టించే ఉత్పత్తులను విక్రయించకుండా, రికవరీ విషయంలో కఠిన మార్గదర్శకాలను అమలు చేయనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *