బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
December 30, 2025

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్పీ అధ్యక్షురాలు ఖలీదా జియా తన 80వ ఏట తుది శ్వాస విడిచారు. గత 20 రోజులుగా వెెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మరణించారు. లివర్, కిడ్నీ మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఆమె బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
రెండుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య. 2018 నుండి జైలు శిక్ష అనుభవించిన ఆమె, ఇటీవల రాజకీయ మార్పుల తర్వాత విడుదలయ్యారు. ఆమె మరణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించింది. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూస్తున్నారు.