బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని షేక్ హసీనా డిమాండ్

బంగ్లాదేశ్ ఎన్నికలను రద్దు చేయాలని షేక్ హసీనా డిమాండ్

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలను ఒక ‘ప్రహసనం’గా అభివర్ణిస్తూ, వాటిని వెంటనే రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. అవామీ లీగ్ పార్టీ లేకుండా నిర్వహించిన ఈ ఎన్నికలను ప్రజలు తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. ఓటు వేయకుండా ప్రజలు తన పిలుపును అందుకున్నారని, రిగ్గింగ్ మరియు అక్రమాల మధ్య జరిగిన ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని ఆమె విమర్శించారు.

కేవలం 48 శాతం ఓటింగ్ నమోదు కావడాన్ని ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ వైఫల్యమని హసీనా అన్నారు. అవామీ లీగ్‌పై ఆంక్షలు తొలగించి, ప్రజాస్వామ్యబద్ధంగా మళ్లీ పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. అక్రమ పద్ధతుల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న వారి చర్యలను ప్రజలు సహించబోరని ఆమె హెచ్చరించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *